అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: శ‌నివారం ప్రారంభ‌మైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేపీ వివేకానంద, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు మాట్లాడారు. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆ తర్వాత సభను ఆదివారం(మార్చి 31) ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *