హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు రోజు అంటే 29వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అందించనుంది. కాగా, సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





