– విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి కేవలం ఐదు నిమిషాల్లోనే ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ లాబీలో విూడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని కూడా వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేసీఆర్, తాను మాట్లాడుకున్నది విూకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో తమ స్ట్రాటజీపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





