– చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లుగా భార్యాభర్తలు
అశ్వారావుపేట/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : అవును వారిద్దరూ జీవితంలో భార్యాభర్తలుగా ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కానీ రాజకీయ పదవుల్లో కూడా ఒకరికొకరు తీడునీడగా ఉండడం యాదృచ్ఛికమే. ఈ సంఘటన అశ్వారావుపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సోమవారం ఉదయం కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్‌గా జూపల్లి శశికళ(6వ వార్డు), వైస్ చైర్మన్‌గా ఆమె భర్త జూపల్లి రమేష్(13వ వార్డు) ఎన్నికయ్యారు. కొత్త పాలకవర్గం కొలువుదీరే వేళ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గతంలో మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశాలకు వినియోగించిన భవనానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్-17, బీఆరఎస్ 2, బీజేపీ-1, ఇండిపెండెంట్-2 గెలిచాయి. కాగా, ఈ మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ మహిళకు రిజర్వు అయింది. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆశీస్సులతో భార్యాభర్తలనే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. వీరిద్దరిని ఇతర కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రమేశ్ మంత్రి పొంగులేటికి ముఖ్య అనుచరుడు. నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అట్ఠహాసంగా జరిగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





