కళాకారులు సమాజాన్ని ప్రభావితం చేయాలి

– వీసీ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి
– ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం
– విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
– అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా మూడు రోజులపాటు జరిగిన చిత్ర కళా శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో కళాకారులు తమ ఆలోచనలు, అనుభవాలను, సృజనాత్మక ఆలోచనలకు శక్తిగా మలుచుకున్నారని, కళాకారులు సృష్టించిన చిత్రాలు గ్రామీణ, నిరుపేద వర్గాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాయని, యూనివర్సిటీ లో అభ్యసించే విద్యార్థులకు ఈ చిత్రాలు స్పూర్తిగా నిలుస్తాయనే ఆశాభావాన్ని ప్రొ. చక్రపాణి వ్యక్త పర్చారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా కమిషన్, చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ కళాకారుల సృజనాత్మక సామర్థ్యాలు, చిత్ర రూపాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, వాటి పట్ల ఎంతగానో ముగ్ధులైనట్లు వెల్లడించారు. మూడు రోజుల శిభిరంలో పాల్గొన్న కళాకారులను ప్రశంసించారు. “సామాజిక సాధికార వారోత్సవాల”లు ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చిత్రకారులు గీసిన ఆ చిత్రాలన్నీ వారి సాంఘిక స్పృహను చాటిచెబుతున్నాయని, యూనివర్సిటీ విధానాలను ప్రతిభింబించేలా ఉన్నాయని ఆనందాన్ని వ్యక్త పర్చారు. ఇంతకాలం విద్యకు దూరంగా ఆదివాసీలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత విద్యను అందించడం మంచి పరిణామంగా పేర్కొంటూ వీసీని అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్ప చక్రపాణి; వీసీ ఓఎస్టీ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. ఆనంద్ పవార్, ప్రఖ్యాత ఆర్టిస్ట్ శ్రీ ఎం.వి. రమణారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *