– రంగస్థలం నిర్వహించారు
– రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిపిన భేటీలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రైతులతో రాహుల్ భేటీ నకిలీ సమావేశం అంటూ బీజేపీ నేతలు విమర్శించారు. రాహుల్ నిర్వహించిన మీటింగ్ కృత్రిమమైనది, అలానే ఆధారం లేనిదంటూ మండిపడుతున్నారు. శనివారం ’ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వీడియోను రిలీజ్ చేశారు. ’రాహుల్ గాంధీ మరోసారి రంగస్థలం నిర్వహించాడు. ఆయన నిర్వహించిన సమావేశం అత్యంత కృత్రిమమైనదిగా ఉంది. అలాగే దీని ద్వారా నకిలీ కథనాన్ని బయటపెట్టారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు రైతులుగా నటించారు. వారితో రాహుల్ గాంధీ నకిలీ సంభాషణ నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను ప్రధాని మోదీ పూర్తిగా రక్షించినా కూడా అమాయకపు రైతులను తప్పు దోవ పట్టించేందుకు రాహుల్ , ఆయన స్నేహితులు ఇలాంటి నకిలీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరి నిజ స్వరూపాన్ని బయటపెడతాను’ అని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అబద్దాలని, నిజమైన రైతులను ఆందోళనకు గురిచేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని రాహుల్‌తో శుక్రవారం జరిగిన సమావేశంలో రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, పప్పు ధాన్యాల రైతుల బతుకుదెరువు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఒప్పందంతో దేశంలోకి వ్యవసాయ దిగుమతులకు తలుపులు తెరుచుకుంటాయని, ఇతర పంటలు కూడా భారత్‌లోకి ప్రవేశిస్తాయని రాహుల్ వారికి చెప్పారని కాంగ్రెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





