కృత్రిమ మేధ‌పై రెండు రోజులసెమినార్‌

షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: షాద్‌నగర్‌ గిరిజన గురుకుల డిగ్రీ పీజీ, మహిళా కళాశాలలో కృత్రిమ మేధ‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈనెల 12, 13తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను సచివాలయంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన గురుకుల సంస్థ అధికారి సబ్యసాచి ఘోష్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్‌ సెక్రటరీ పి.మాధవీదేవి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్‌ కే.వేణుగోపాల్‌రావు, గిరిజన గురుకుల ఓఎస్డీ నటరాజ్‌, షాద్‌నగర్‌ గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతా విడుదల చేశారు. ఈ జాతీయ సదస్సును దిగ్విజయంగా నిర్వహించుకోవాలని మంత్రి అడ్లూరి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *