మన ఆలోచనలకు అందనంతగా ఏఐ

– మానవ అభివృద్ధిలో ఏఐది కీల‌క‌ భూమిక
– భారత్‌లో ఏఐ పురోభివృద్ది చరిత్రగా నిలుస్తుంది
– ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సదస్సులో ప్రధాని మోదీ

న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్(ఏఐ  సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా పునఃసక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సదస్సులో గురువారం ప్రధాని ప్రసంగించారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మేకిన్‌ ఇం‌డియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉందని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని చెప్పారు. కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. భారత్‌లో ఏఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు. కృత్రిమ మేథకు పరివర్తన శక్తి ఉందని ప్రధాని చెప్పారు. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని అన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు.. ప్రస్తుతం కృత్రిమ మేథను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్న అని అన్నారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్‌మార్క్‌లు అని, మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం అవ్వాలని ప్రధాని అన్నారు. కృత్రిమ మేథ మనలను శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని మోదీ చెప్పారు. కృత్రిమ మేథ వినియోగంలో ‘మానవ్‌ ‌విజన్‌’ ఉం‌డాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్‌ అర్థం, ఫ్రేమ్‌వర్క్ అని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *