LGBTQIA + సముదాయాలుగా మామీద జరిగిన శ్రమదోపిడీ, మాన, ప్రాణహానికి ఈ సమాజం దగ్గర సాక్ష్యాలు, సంఖ్యలు లేవు, ఏ గణితాలు పనిచేయవు. అందుకే మా గురించి రాయటానికి సమయమే కాదు సాహసం కూడా మా సముదాయం చేయలేదు. ఇప్పటిదాకా వొచ్చిన రచనలు మా సముదాయం నాయకుల, వారి జీవితప్రయాణాలను మా సముదాయానికి జరిగిన సంస్థాగతమయిన వివక్షను హింసను కళ్ళముందు ఆవిష్కరించాయి గాని ఒక పోరాటంగా లేదా సమాజంలో ఆడ మగ వారు అసలు మా జీవితాల గురించి వారి అవగాహన కేవలం జాలి దయవరకే పరిమితమై ఉన్నాయా? మా స్వేచ్ఛ, స్వాతంత్రము సమానత్వాల మీద సమాజంలో ఆడ మగ రచయితలు ఏమనుకుంటున్నారు అన్నది ఎక్కడ చదవటానికి కుదరలేదు.
ఎవరన్నా వ్రాస్తేనే, మనం చదువుతాము, చదివితేనే అర్ధం చేసుకుంటాము అర్ధం చేసుకుంటేనే ఆచరించగలుగుతాము. వ్రాసింది ఏదయినా వ్రాసినవారి అవగాహనస్థాయినే కాదు వారి మానవీయతను కూడా చూపిస్తుంది. ఆడమగ రచయితలందరికి ఇదే నా మనవి, ప్రయతిస్తే పోయేదేమీ లేదు అన్న మహాకవి వాక్కు నిజమయితే ప్రయతించండి వ్రాయటం మొదలుపెట్టండి. దీనివల్ల చర్చ మొదలవుతుంది. తుది గెలుపు ప్రేమదో ద్వేషానిదో కాలమే నిర్ణయిస్తుంది.






ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల