- తెల్లవారు జామున చేరుకునే ఛాన్స్
వాషింగ్టన్, ఏప్రిల్ 6: చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెర్‌మిస్-2 మిషన్ మరి కొన్ని గంటల్లో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్ వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం పరిధిలోకి వెళ్లింది. ఈస్టర్న్ డేలైట్ టైమ్ అమెరికా కాలమానం ప్రకారం, 6న సాయంత్రం 7.07 గంటలకు భూమి నుంచి గరిష్ఠంగా 252,757 మైళ్ల దూరానికి వ్యోమనౌక చేరుకుంటుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సుమారు 4.35 గంటల సమయంలో వ్యోమనౌక ఈ గరిష్ఠ దూరానికి చేరుకుంటుంది. దీంతో, ఇది భ్మూద నుంచి అత్యధిక దూరానికి చేరిన మానవసహిత యాత్రగా నిలిచిపోతుంది. 1970లో నాసా చేపట్టిన అపోలో-13 మిషన్ కంటే 4,102 మైళ్ల అధిక దూరానికి ఒరాయన్ నౌక చేరుకుంటుంది. ఈ మిషన్‌లో భాగంగా నాసా ఆస్ట్రోనాట్స్ రీడ్ వైస్‌మెన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనాతో పాటు కెనడా వ్యోమగామి జెరె హాన్సన్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఫొటోలు తీయనున్నారు. సాధారణంగా జాబిల్లికి చెందిన ఒకవైపు మాత్రమే భూమ్మిద నుంచి కనిపిస్తుంది. భూమ్మీద నుంచి చూడటం సాధ్యం కాని రెండో వైపును ఫార్ సైడ్ అని శాస్త్రవేత్తలు పిలుస్తారు. తాజా మిషన్‌లో ఆస్ట్రోనాట్స్ ఫార్ సైడ్‌న ఉన్న ఉపరితలాన్ని ఫొటోలు తీయనున్నారు. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉపరితలానికి 4 వేల మైళ్ల ఎత్తునుంచి ఈ ఫొటోలు తీసుకున్న అనంతరం భూమివైపు తిరుగుప్రయాణం అవుతారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఈలైబై పక్రియ ప్రారంభం అవుతుంది. మిషన్ అనంతరం ఏప్రిల్ 10న వ్యోమగాములు భూమికి చేరుకుంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

