ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కళను అందరికీ నేర్పించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌లోని గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి శిక్షణను పూర్తి చేసిన 30మంది గిరిజన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లను అభినందించి
తమతమ పాఠశాలల్లో విద్యార్థినీవిద్యార్థులకు ఈ ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ కళను నేర్పించి వారి అభిరుచికి, ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వాకులు, గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థం సంచాలకురాలు డాక్టర్ వేమూరి సముజ్వల మాట్లాడుతూ ఈ అరుదైన శిక్షణ కార్యక్రమానికి వెసులుబాటు కల్పించిన గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్  చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌కు కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఈ శిక్షణలో నైపుణ్యం సాధించిన వారు తమ ఐటీడీఏలలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వందలాదిమంది విద్యార్థినీవిద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నిష్ణాతులైన అభ్యర్థులు తాము తయారు చేసిన బ్లాక్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్స్ ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. శిక్షణనిచ్చిన డాక్టర్ సునీత ప్రసాద్ మాట్లాడుతూ ఈ కళకు అంతర్జాతీయస్థాయి మార్కెట్ సిద్ధంగా ఉందని, రెండుమూడు రెట్లు లాభం వస్తుందని, గిరిజనులు తయారు చేసిన మెటీరియల్‌ను కొంతకాలం తమ సంస్థ ద్వారానే కొని వారికి మంచి మార్కెట్ చూపించగలమని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డెరెక్టర్లు పోచం సంధ్యారాణి, సూపరింటెండింగ్ ఇంజనీర్ హేమలత, గిరిజన మ్యూజియం క్యురేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీఈటీసీ కో ఆర్డినేటర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *