- విచారణకు రమ్మంటే రాత్రి కే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని పరారీ
– అందుకే ఇద్దరిని అరెస్ట్ చేశాం.. వివరాలు త్వరలో వెల్లడిస్తాం
– మీడియాతో నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
మహిళపై ఉద్దేశ్యపూర్వక దుష్ప్రచారం- ‘ఎక్స్ ‘లో సజ్జన్నార్
మహిళా అధికారిపై అసత్య కథనాలు ప్రసారం చేయడంపై సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలపై విమర్శ కాదు.. దుష్ప్రచారం నేరం. ప్రజా జీవితంలో విమర్శలు సహజమే. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు విమర్శలు కావు.. అవి క్రూరత్వం. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం. టీవీ చర్చలు, సోషల్ డియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం. నేడు ప్రతి పనిలో మహిళలు ముందువరుసలో నాయకత్వం వహిస్తున్నారు. పాలన, పోలీసు శాఖ, శాస్త్ర రంగం, డియా సహా ప్రజాజీవితంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇల్లు-ఉద్యోగం రెండింటినీ సమతుల్యం చేస్తున్నారు మహిళలు. కనిపించని బాధ్యతలతో కుటుంబాన్ని నడుపుతూ.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై దాడులు ప్రగతిపై దాడులే.భారతీయ సంప్రదాయం చెబుతున్న సందేశం ప్రకారం ’యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ .. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్పచ్రారం ఆందోళనకరం. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుంది. ముందుండి నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే నష్టం. స్పష్టమైన సందేశం ఒక్కటే.. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించబోము. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్.. ఆ భవిష్యత్తు గౌరవంతోనే నిర్మితమవుతుంది.. అవమానంతో కాదు’ అంటూ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





