– నగరంలో శోభాయత్రకు భారీగా ఏర్పాట్లు
– యాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు. శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించనున్నారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు డైవర్ట్ చేయనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అప్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ విÖదుగా మళ్లించనున్నారు. అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. బేగంబజార్, అప్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. సీతారాంబాగ్ టెంపుల్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు జరిగే ఈ శోభాయాత్ర మార్గంలో వాహనాలకు మళ్లింపులు అమలు చేస్తారు. ప్రత్యేకంగా బేగంబజార్, అప్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సర్వం సిద్ధమయ్యారు. 2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు క్రమశిక్షణతో జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





