వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 26 : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రమేశ్ ఓడిపోయారు. గతంలో బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్.. ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. అయితే, గులాబీ పార్టీలో ఎప్పుడు చేరుతారనే విషయం ఆయన వెల్లడించలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



