ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మూడ్రోజుల్లో ముగియలేదు

– ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆసక్తిక వ్యాఖ్యలు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టడం, ముగించడంపై ఆర్మీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ అం‌దరూ అనుకున్నట్లు మూడు రోజుల్లోనే ముగిసిపోలేదని, చాలా రోజులు కొనసాగిందని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. దిల్లీలో ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌: ‌ది అన్‌టోల్డ్ ‌స్టోరీ ఆఫ్‌ ఇం‌డియాస్‌ ‌డీప్‌ ‌స్ర్టెక్స్ ఇన్‌సైడ్‌ ‌పాకిస్థాన్‌’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ద్వివేది మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో మే 10న యుద్ధం ముగిసిందని రు అనుకుంటున్నారు. కానీ కాదు. అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో.. అది చాలా రోజులు కొనసాగింది. ఆ విషయాలన్నీ ఇక్కడ వెల్లడించలేను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్‌ ‌మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉన్నారని, సరిహద్దు వెంబడి వారి చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారో అందరికీ తెలుసన్నారు. ఆపరేషన్‌ ‌సమయంలో సాయుధ దళాల సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ద్వివేది స్వాగతించారు. డ్రోన్‌లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం హర్షణీయమన్నారు. భారత్‌ ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’‌తో పాక్‌, ‌పీవోకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంతో కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజులపాటు భీకర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అనంతరం పాక్‌  అభ్యర్థన మేరకు భారత్‌ ‌కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ క్రమంలో ద్వివేది చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *