ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో క్రెచీ ఏర్పాటు

– ప్రారంభించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  నిజంగా నా జీవితంలో ఇవ్వాళ ఎంతో ఆనంద‌క‌ర‌మైన రోజ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.  ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో చిన్న పిల్ల‌కోసం ఒక క్రెచీ బుధ‌వారం ప్రారంభ‌మైంది. నా సంతోషానికి కార‌ణం ఇదీ! ఇక్క‌డ వెయ్యిమంది మ‌హిళ‌ల‌తో కూడిన‌ కాంటింజెంట్ వుంది. 2022 ఫిబ్ర‌వ‌రిలో సీఏఆర్ (ఆర్మ్ డ్ రిజ‌ర్వ్) హెడ్ క్వార్ట‌ర్‌ను నేను సంద‌ర్శించిన‌ప్పుడు ఇక్క‌డి మ‌హిళా ఆఫీస‌ర్లు, చిన్న‌పిల్ల‌ల‌కోసం ఒక క్రెచీ ఏర్పాటు చేయాల‌ని అభ్య‌ర్థించారు. దీంతో తాను దీన్ని ఏర్పాటుచేసేవారికోసం అన్వేష‌ణ మొద‌లుపెట్టాన‌న్నారు. చివ‌ర‌కు త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించి ఒక మెగా ఇంజినీరింగ్ కంపెనీ క్రెచీ ఏర్పాటుకు ముందుకొచ్చింద‌న్నారు. 2023 ఏప్రిల్ నెల‌లో దీనికి శంకుస్థాప‌న జ‌రిగింది.  తాను క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌గా లేని ప‌దినెల‌ల కాలం ఈ ప‌నులు నిలిచి పోయాయ‌న్నారు. త‌ర్వాత న‌వంబ‌ర్ 24న ప‌నులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం దీని నిర్మాణం పూర్త‌యింది. 15వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో వున్న ఈ క్రెచీలో 200 మంది పిల్ల‌ల సంర‌క్ష‌ణ చూసుకోవ‌చ్చు. ఇవ్వాళ దీన్ని ప్రారంభించే అవ‌కాశం ల‌భించ‌డంతో ఎంతో ఆనందంగా వున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  హెచ్‌.సి.పి. సిబ్బంది కోసం తాను చేసిన ఒక అద్భుత కార్య‌మ‌ని ఆయ‌న సంతృప్తిని వ్య‌క్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *