పారిస్ట ఒలంపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ కైవసం
తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి అర్జున అవార్డ్ వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. విశాఖకు చెందిన అద్లెట్ జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‌కు ఎంపికయ్యింది. వరంగల్ జిల్లా క్లలెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరుగిన పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 400 విటర్ల టీ20 విభాగం ఫైనల్స్‌లో 55.82 సెకన్‌లలో రేస్‌ని కంప్లీట్ చేసి తెలంగాణ యువతి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్‌లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్‌కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‌గా దీప్తి దీప్తి జివాంజి రికార్డ్ క్రియేట్ చేసింది.
దీనికి ముందు జపాన్?లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లోను 400ల మీటర్ల రేస్‌ను 55.07 సెకన్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి.. ఖమ్మం డిస్ట్రిక్ అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది. దీప్తి అద్భుత టాలెంట్‌ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరాబాద్‌కి తీసుకొచ్చారు.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. హైదరాబాద్‌లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్?లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మోరు మోగిపోయింది. ఈ నేపథ్యంలోనే విశ్వ క్రీడల్లో పతకం సాధించి దేశ జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది.





