ఆధునిక కాలంలో ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రజా ప్రభుత్వాలు కాదు.ప్రజలెన్నకున్న నేతలు కాదు.ప్రపంచాన్ని శాసిస్తున్నది సోషల్ మీడియా.. ఆ కంపెనీలకు చెందిన దేశాలు.ప్రజాస్వామ్యం ఒక భ్రమ.ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక మిథ్యా..సోషల్ మీడియానే షాడో ప్రభుత్వాలు. ప్రజా ఉద్యమాలను అవే నిర్ణయిస్తాయి.. అవే ముగించేస్తాయి. డేటాను అడ్డుపెట్టుకుని తమకు ఏలాంటి ప్రభుత్వాలు కావాలో.ఎలాంటి నేతలు కావాలో ప్రజల అభిప్రాయాలను మార్చేస్తాయి..తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చడం, నచ్చని నేతలను పదవీచిత్యుడిని చేయడం అంతా ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల చేతుల్లో ఉంది..దానికి అందమైన ప్రజాస్వామ్య పోరాటాలు, ప్రజా ఉద్యమాలు అనే ట్యాగ్‌లైన్ తగిలిస్తాయి.
నేపాల్‌లో జెన్ జీ యువత రోడ్డెక్కారు..ఓలీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ధిక్కరిస్తూ ఆందోళన బాట పట్టారు..అవినీతి, బంధుప్రీతి, అణిచివేత, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్‌జీ (Gen-Z) తరం తిగుబాటు చేశారు..ఓలీ దిగిపో, దేశం విడిచి వెళ్లిపో వంటి నినాదాలతో నేపాల్ పార్లమెంట్‌ను ముట్టుడించారు..జెన్ జీ యువత స్లోగన్స్‌తో నేపాల్ పార్లమెంట్ వీధులు దద్దరిల్లాయి.
ప్రజా ఉద్యమాలు,ప్రజా పోరాటాలను అణచివేయడంలో లెఫ్ట్ రైట్ పార్టీలన్న తేడాలు ఏమీ లేదు..అధికారంలో ఉన్న అన్ని పార్టీలు ఉద్యమాలను అణచివేయాలనే చూస్తాయి.నేపాల్ కూడా జెన్ జీ ఉద్యమాన్ని ఓలీ సర్కార్ కఠినంగా అణచివేసింది. సామాజిక మాధ్యమాలపై అంక్షలు విధించడంపై కదం తొక్కిన యువతను ప్రభుత్వం ఆర్మీతో అణచివేసే ప్రయత్నం చేసింది..నేపాల్‌లో సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ చట్టాలను గౌరవించి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఓలీ సర్కార్ ప్రకటించింది..నేపాల్ చట్టాలను గౌరవించని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఓలీ నిషేధం విధించారు..పశ్చిమ దేశాలకు చెందిన, మరీ ముఖ్యంగా అమెరికాకు చెందిన సోషల్ మీడియాను బ్యాన్ చేశారు.
నేపాల్‌లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడాన్ని ప్రధాని ఓలీ సమర్థించుకోవడం అగ్గికి ఆజ్యం పోసింది..పార్లమెంట్ ముట్టడికి జెన్ జీ తరం పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత భారీ ర్యాలీగా పార్లమెంట్ ముట్టడికి వెళ్లారు. అయితే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపి నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో వందల మంది గాయపడగా ,దాదాపు 20 మంది మృతి చెందారు .దీంతో నేపాల్ రాజధాని ఖట్మాండ్ రోడ్లు రక్తంతో ఎరుపెక్కాయి. ఆందోళనకారుల నినాదాలతో నేపాల్ దద్దరిల్లింది.. చివరికి జెన్ జీ పోరాటంతో ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది..ఇది ప్రజా విజయం. అయితే నేపాల్ జెన్ జీ పోరాటం ప్రపంచానికి ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది.. ప్రభుత్వాలు ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తూ, జనాల గొంతు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు ఎలా ఉంటుందో నేపాల్ యువత చూపించారు. ఎంతటి నియంతృత్వ ప్రభుత్వాలైన ప్రజా పోరాటాలతో దిగిరావాల్సిందేనని నిరూపించింది.
జెన్‌జీ(Gen-Z) తరం అంటే 1996 తర్వాత 2010కు ముందు పుట్టిన వారిని జెన్ జీ జనరేషన్ అని పిలుస్తారు. సహజంగా సోషల్ మీడియా అమల్లోకి వచ్చిన కాలంలో జన్మించారు కాబట్టి జెన్ జీ తరంగా పిలుచుకుంటారు. వీరికి విస్తృతంగా సామాజిక మాధ్యామాలు అందుబాయిలో ఉంటాయి..ఇది డిజిటల్ తరంగా కూడా చెప్పవచ్చు..వారి జీవితంలో ప్రతీది టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది.
జెన్ జీ ఉద్యమం కేవలం నేపాల్‌లో నిరుద్యోగం,ప్రభుత్వంలో అవినీతి,వారసత్వ రాజకీయం,నిత్యవసర ధరలు అన్నిటికీ మించి దేశ ప్రజల్లో పెరుగుతన్న ఆర్థిక అంతరాలు కూడా జెన్‌జీ ఉద్యమంలోని కీలక అంశాలు. అయితే పశ్చిమ దేశాల మీడియా మాత్రం కేవలం సోషల్ మీడియాను ఓలీ ప్రభుత్వం బ్యాన్ చేయడంపై తిరుగుబాటు వచ్చిందనే ప్రచారం చేసింది..నేపాల్ సర్కార్‌పై యువత పోరాటం అసలు ఉద్దేశ్యాన్ని తప్పుదారి పట్టించి కేవలం,సామాజిక మాధ్యమాల బ్యాన్ చుట్టే వెస్ట్రన్ మీడియా ప్రాపగండా చేసింది.ఇక్కడ జెన్ జీ ఉద్యమంలో మరో కీలకమైన అంశం అంతర్గతంగా దాగి ఉంది.ప్రజల గొంతునొక్కే ఓలీ ప్రభుత్వం నియంతృత్వం పోకడ ఒకటైతే..అమెరికా సోషల్ మీడియా కంపెనీల గుత్తాధిపత్యం మరోకటి ఉంది.
ప్రజలను అణచివేసే ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలి.అభ్యుదయభావాలతో హక్కులు కోసం పోరాటం చేస్తూ దేశాలు ముందుకు వెళ్లాలి..అందుకు జెన్ జీ ఉద్యమాలు చాలా అవసరం కూడా..కానీ ఆ ఉద్యమాలు విశాల ప్రజల కోణం, దేశ భవిష్యత్ కోసం కాకుండా కేవలం అమెరికా ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా అధిపత్యాన్ని దేశాలపై మరింత పెంచేదిగా ఉంటే , అది ప్రజాస్వామ్య దేశాల ఉనికికే చాలా ప్రమాదకరం..నేపాల్‌లో జెన్‌జీ పోరాటంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం కనిపించిన, అది పశ్చిమ దేశాల సామాజిక మాధ్యమాల కోసమే జరిగిందన్న అభిప్రాయం ఉంది.
బానిసకాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ఉద్యమాల వరకూ యుద్ద నీతి మారింది.పోరాట ఎత్తుగడలు మారాయి..తిరుగుబాటు వ్యూహాలు మారాయి..రాళ్లు, బాణాలు బరిశెల నుంచి నేటి అణుబాంబు, ఆర్థిక, డేటా స్టోరేజ్ వరకూ యుద్దాయుధాలు మారాయి..ప్రపంచాన్ని ఆర్ధికం, డేటా ఆయుధాలు బయపెడుతున్నాయి ..ఈ రెండే ఇప్పుడు భూగోళాన్నిశాసిస్తున్నాయి.. ఇందులో భాగంగానే సోషల్ మీడియా కంపెనీలు దేశాలను, ప్రభుత్వాలను డిక్టెక్ చేస్తున్నాయి..ప్రభుత్వాలు, ప్రజలు సామాజిక మాధ్యమాల గుప్పింట్లో బహిరంగానే బందీలయ్యారు.
ఆధునిక కాలంలో ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రజా ప్రభుత్వాలు కాదు.ప్రజలెన్నకున్న నేతలు కాదు.ప్రపంచాన్ని శాసిస్తున్నది సోషల్ మీడియా..ఆ కంపెనీలకు చెందిన దేశాలు.ప్రజాస్వామ్యం ఒక భ్రమ.ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక మిథ్యా..సోషల్ మీడియానే షాడో ప్రభుత్వాలు.ప్రజా ఉద్యమాలను అవే నిర్ణయిస్తాయి..అవే ముగించేస్తాయి.డేటాను అడ్డుపెట్టుకుని తమకు ఏలాంటి ప్రభుత్వాలు కావాలో.ఎలాంటి నేతలు కావాలో ప్రజల అభిప్రాయాలను మార్చేస్తాయి..తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చడం, నచ్చని నేతలను పదవీచిత్యుడిని చేయడం అంతా ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల చేతుల్లో ఉంది..దానికి అందమైన ప్రజాస్వామ్య పోరాటాలు, ప్రజా ఉద్యమాలు అనే ట్యాగ్‌లైన్ తగిలిస్తాయి.
ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వాలను కూల్చడానికి అణువ్వాయుధం కంటే డేటా అనేది పదునైనా ఆయుధం.దాన్నే అమెరికా సోషల్ మీడియ సంస్థలు అవకాశంగా మార్చుకున్నాయి.అమెరికా రోజు రోజుకు తన ఉనికి కోల్పోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు తన సోషల్ మీడియాతో మళ్లీ ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.యూఎస్ సర్కారు ఒత్తిడిలో ఆ సంస్థలు పావులుగా మారాయి.ప్రభుత్వాలను కూల్చే ఆయుధంగా మారాయి. టారిఫ్ లే కాదు.సోషల్ మీడియాను కూడా యూఎస్ యుద్ధాయిధంగా మార్చుకుంది.
అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టే బాధ్యతను ఆ దేశ సోషల్ మీడియా దిగ్గజాలు భుజాలకెత్తుకున్నాయి. అమెరికా లక్ష్యాలకు ఇతర దేశాల్లో సంస్థలు ప్రజా మూడ్ క్రియేట్ చేస్తున్నాయి.సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నచ్చని ప్రభుత్వాలను అగ్ర దేశం కూల్చుతుంది. దీని అందమైన ప్రజా, హక్కుల ఉద్యమాలన్న కలర్ రుద్దుతుంది.ఇవాళ నేపాల్‌లో జెన్ జీ ఉద్యమం తరహాలోనే గతంలో పాక్, అప్ఘాన్, బంగ్లా, మయన్మార్,అరబ్ దేశాల్లో చూశాం.కానీ స్థిరమైన నాయకత్వం, స్పష్టమైన విజన్ దీర్ఘకాలిక ప్రయోజనాలు లేకపోడంతో అవేవీ అంతిమ లక్ష్యాలను అందుకోకుండానే అర్ధంతరంగా కనుమరుగైన చరిత్ర కళ్లముందే ఉంది.
జేన్ జీ ఉద్యమాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చు. ప్రపంచ రాజకీయ భౌగోలిక పరిస్థితి మార్చి, కొత్త ఆశలు కల్పించేలా కనిపించవచ్చు.నూతన ప్రపంచాన్ని నిర్మిస్తాయన్న ఆశలు ప్రజాస్వామ్యవాదుల్లో కనిపించవచ్చు.కానీ అసలు సమస్య అక్కడే ఉంది.జెన్ జీ ఉద్యమాల్లో ఎంత ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించిన అంతే బానిసత్వ పోరాటం కనిపిస్తుంది. జెన్ జీ తరం కొత్త తరహా రాజకీయ పోరాటాలకు కేంద్ర బిందువు కావచ్చు. జెన్ జీ తరం చుట్టు సోషల్ మీడియా సాలే గూడుల అల్లుకున్నాయి..జెన్ జీ తరం సోషల్ మీడియాకు బానిసలుగా మారారు..జెన్ జీ తరాన్ని ఆ సంస్థలు, పరోక్షంగా అగ్ర రాజ్యం సోషల్ బానిసలుగా మార్చింది..సోషల్ మీడియా లేకపోతే బతకలేమ్మ స్థాయికి జెన్ జీ తరాన్ని తయారు చేశాయి..ఇప్పుడు ప్రపంచం ఎలా ఉండాలో డేటా నిర్ణయిస్తుంది..డేటా స్టోరేజ్ కంపెనీలు ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.అవకాశం రాగానే జెన్ జీ తరాన్ని తన ప్రత్యార్థిపై తిరుగుబాటు దారులుగా మార్చుతుంది.
అణ్వాయుధాల కంటే డేటా పెద్ద వ్యాపారంగా మారింది..జెన్ జీ తరం అమెరికాకు ఆయుధంగా మారింది.జెన్ జీ తరంతో ప్రభుత్వాలను కూల్చుతుంది.భారత దేశం చుట్టూ ఉన్న దేశాల్లో కూడా జెన్ జీ ఉద్యమాలు పెరిగాయి.ఒక రకంగా జెన్ జీ ఉద్యమాలు క్లౌడ్ బరెస్ట్ ఉద్యమాలయ్యాయి. నిజానికి ఆయా దేశాల్లో జెన్ జీ తరం ఉద్యమాలు చేస్తున్నారంటే.తెర వెనుక సోషల్ మీడియా సంస్థల హస్తం ఉంది.బయటకు ప్రజాస్వామ్య పోరాటాలుగా కనిపిస్తున్నా.ఆయా దేశాల్లో అగ్రదేశం తన గుత్తాధిపత్యం కోసం ప్రభుత్వాలను జెన్ జీ తరాన్ని అడ్డుపెట్టుకుని డిక్టేట్ చేస్తుంది.
గత కొంత కాలంగా అమెరికాకు చెందిన సోషల్ మీడియాను చాలా దేశాలు బ్యాన్ చేస్తున్నాయి..అయితే ఎక్కడ సోషల్ మీడియాను నియంత్రించే ప్రయత్నం జరుగుతుందో అక్కడ జెన్ జీ ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి.ఇదంత యాధృచ్చికం అయితే కాదు.. సోషల్ మీడియాపై ఆంక్షలతో ఆ కంపెనీలకు , అమెరికాకు భారీ నష్టం జరుగుతుంది..దీంతో సోషల్ మీడియా ఆంక్షలో వ్యాపారానికి నష్టం అమెరికా కంపెనీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఏ దేశాల్లో సోషల్ మీడియాపై ఆంక్షలున్నాయో, ఆయా దేశాల్లో జెన్ జీ ఉద్యమాలను సోషల్ మీడియా కంపెనీలు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.ప్రజల్లో అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి.
ఆయా దేశాల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం, అధిక ధరలు, వారసత్వ రాజకీయాలు, సంపద కేంద్రీకృతం,హక్కుల అణచివేత, ప్రజాస్వామ్య హననాని సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలపై కంపెనీలు జెన్ జీ తిరుగుబాటు ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రజాస్వామ్యం, దేశ పురోభివృద్ధికి ప్రజాస్వామ్య ఉద్యమాలు అవసరం.ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటలు లేని దేశాలు అంధకారంలోనే ఉన్నాయి.కానీ అవి అమెరికా సోషల్ మీడియా సంస్థలకు అవకాశంగా ఉండొద్దు.అలా ఉన్నాయంటే ప్రపంచ నయా బానిసత్వానికి గురికావాల్సి వస్తుంది.ఇవాళ అమెరికా సోషల్ మీడియ కంపెనీలు జెన్ జీ తరాన్ని బానిసలుగా మార్చుకుంది.నయా బానిస సైన్యాన్ని నిర్మించుకుంది.ఆ సైన్యంతో దేశాలను గుప్పిట్లో పెట్టుకుంటుంది.తమ కంపెనీల లాభం కోసం పోరాటాలు చేయిస్తుంది.ప్రభుత్వాలు తొగ్గిపోగానే ఉద్యమాలను నీరుగార్చుతుంది.
గత కోంత కాలంగా జెన్ జీ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రజలను చైతన్యం చేస్తున్నాయి.అయితే ఈ జెన్ జీ ఉద్యమాలు ప్రజల సమస్యలు, ప్రభుత్వాల అణచివేత వ్యతిరేకంగా కంటే.కార్పొరేట్ కంపెనీల అనుకూలంగా ఉంటున్నాయి.ఇవాళ నేపాల్ జరుగుతున్న జెన్ జీ ఉద్యమంలో ప్రజాస్వామ్య స్పూర్తి, అణిచివేత,నియంతృత్వ ప్రభుత్వ వ్యతిరేకత ఉండవచ్చు.కానీ, మొత్తం ఆ పోరాటం కేవలం సోషల్ మీడియా నిషేధం పై జరిగింది.ఇది తాత్కాలికంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు.కానీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దొకడం లేదు..జేన్ జీ తరాన్ని మెజారిటీ ప్రజల సమస్యలపై పోరాటం కాకుండా..సోషల్ మీడియా కంపెనీల లాభాల చుట్టే తిప్పడం అత్యంత ప్రమాదం.
సామాజిక మాధ్యామాలపై ప్రభుత్వం బ్యాన్ ఎత్తివేయగానే ఉద్యమం నీరుగారింది..నిరుద్యోగం, ధరల పెరుగుదల, హక్కుల అణిచివేత, వారసత్వరాజకీయాలు,ప్రజల మధ్య అర్థిక అంతరాలపై చర్చ లేకుండా పోయింది.నాయకత్వం లేని జెన్ జీ ఉద్యమాలతో లాభాలు కంటే నష్టమే ఎక్కువ..స్థిరమైన విజన్, లక్ష్యం లేని జెన్ జీ ఉద్యమాలు తాత్కాలికంగా ప్రభుత్వాలను పడగొట్ట వచ్చు కానీ దీర్ఘకాలికంగా దేశం సోషల్ మీడియా సంస్థల చేతుల్లో బందీ కావచ్చు.జెన్ జీ ఉద్యమాలు ఉండాలి..అవి తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో నడవాలి.లేకపోతే అమెరికా చేతిలో జెన్ జీ తరం, దేశాలు నయా సోషల్ బానిసలుగా మారే ప్రమాదం ఉంది.
-తోటకూర రమేష్