జూబ్లీహిల్స్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి శ్రీధర్‌ ‌బాబు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో పర్యటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌ ‌యాదవ్‌కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి శ్రీధర్‌ ‌బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్‌ ‌యాదవ్‌ ‌పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారన్న‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అం‌టే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతమని అనుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో కాలుష్యం తీవ్రంగా పెరిగిందని, పరిశ్రమలను నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. అలాగే కమలాపురి కాలనీలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హా ఇచ్చారు. పట్టణ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *