యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు ముఖ మండపంలో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న ప్రముఖులు
తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ రేణుక యారా కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు వారికి స్వామివారి లడ్డు ప్రసాదాలను అందజేశారు.
——————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



