– ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంగా గుర్తింపు
– ఇనుప యుగం నాటి నాగరిగత అధ్యయనం లక్ష్యం
పినపాక, ప్రజాతంత్ర, జనవరి 13 : పురావస్తు శాఖ (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం–పాండురంగాపురం గ్రామ పరిధిలో ఉన్న ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంలో మంగళవారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాలను పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డా. నిఖిల్ దాస్ ఎన్అ ధికారికంగా ప్రారంభించారు. ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని శాస్త్రీయంగా తవ్వి లిఖితపూర్వకంగా నమోదు చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని వారు తెలిపారు. స్థల ప్రారంభ కార్యక్రమంలో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ డా. సాయి కృష్ణ ఈ. కన్జర్వేషన్ అసిస్టెంట్ మల్లేశం మడపల్లి, మార్క్‌స్మాన్ పండు యాదవ్, నిఖిల్ ప్రియదర్శి (రిసెర్చ్ స్కాలర్)తో పాటు ఏఎస్ఐ సిబ్బంది ఇబ్రహీం షరీఫ్, మనోహర్ సైనీ, ఆదర్శ్ ప్రతాప్, సచిన్ బోరా తదితరులు పాల్గొన్నారు. జనంపేట స్థలం, ఉపరితలంపై కనిపించే మెగాలిథిక్ సమాధి నిర్మాణాల ఆధారాలతో, ఒక ముఖ్యమైన ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంగా గుర్తింపు పొందింది.
ఈ స్థలానికి సంబంధించిన ఇనుప యుగ–మెగాలిథిక్ సంస్కృతుల పురావస్తు ఆధారాల స్వరూపాన్ని అవగాహన చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్థలాన్ని నిర్ధారించడం, ఈ ప్రాంతంలోనూ, ద్వీపకల్ప దేశంలోనూ ఉన్న సమకాలీన సమాధి స్థలాలతో దీని సంబంధాన్ని తెలుసుకోవడం, ఈ ప్రాంతానికి చెందిన ప్రజల సామాజిక–ఆర్థిక మరియు పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం, సాధ్యమైనంత వరకు ఈ స్మారకాలను నిర్మించిన ప్రజల నివాస ప్రాంతాలను గుర్తించడం కూడా ఈ తవ్వకాల లక్ష్యాలలో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా, స్థానిక ప్రజల్లో సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు, వారసత్వ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయేందుకు స్థల పరిసరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పరిశోధన ఫలితాలు రాష్ట్రంతోపాటు విస్తృత డెక్కన్ ప్రాంతంలోని ప్రాగైతిహాసిక, మెగాలిథిక్ సంస్కృతులపై అవగాహనను మరింత విస్తరించనున్నాయని ఆశిస్తున్నారు. ప్రాంతంలోని పురావస్తు వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రజల అవగాహన, స్థానిక సహకారం ఎంతో ముఖ్యమని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





