జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆమోదం

– మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
– ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సమావేశం పరిశీలించింది. మీడియా అకాడమీ చైర్మన్, ఎసఎంఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్, ఎస్‌ఎంఏసీ కో-చైర్‌పర్సన్ సీహెచ్.ప్రియాంకలతో అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. జర్నలిస్టుల నుంచి అందిన ప్రతీ దరఖాస్తును కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, అర్హత కలిగిన ప్రతీ జర్నలిస్టుకు కార్డు మంజూరులో ఎలాంటి లోపం ఉండదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని వచ్చే నెల మొదటి వారంలో మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు పంపే జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసీ) ప్రతిపాదనలను కూడా పరిశీలించి ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్లను కోరారు. సమాచార-పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కిషోర్‌బాబు, అదనపు డైరెక్టర్ డి.ఎస్.జగన్ ఇతర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *