సైన్యంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ -2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా ఇప్పుడు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10వ తేదీ లోపు తమ దరఖాస్తు ప్రక్రియను www.joinindianarmy.nic.in ద్వారా పూర్తి చేయాలని కోరారు. అభ్యర్థులు తమ అర్హత (వయసు, విద్యార్హత, శారీరక ప్రమాణాలు) గురించి అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. భారతీయ సైన్యం దేశ యువతకు సాయుధ దళాల్లో సేవ చేసే సమాన అవకాశాలు కల్పించడానికి పూర్తిగా ఆటోమేటెడ్, న్యాయమైన, పారదర్శక పద్ధతిన నియామకాలు జరుగుతాయి. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుందని, ఏవిధమైన సిఫార్సులకు తావు లేదని, మోసపూరిత ఏజెంట్లతో అభ్యర్థులు జాగ్రత్త వహించాలని స్పెషల్ కమిషనర్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *