తప్పు ఒప్పుకో.. ప్రజలకు క్షమాపణ చెప్పు

– సీఎం సహా మంత్రులందరూ అవినీతిపరులేన‌న్న‌ పొంగులేటి
– అవినీతి బట్టబయలయ్యేసరికి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు
– అందుకే తిట్ల దండకం ఎత్తుకున్నారు
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు

వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి (మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి) మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు, చర్చి పక్కనే ఉన్నా నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడారు అని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. వనపర్తి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్‌ ‌వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి బూతులు వింటే ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తున్నది.. సరకు లేనపుడు, సమాధానం లేనపుడు తిట్లు ఎత్తుకుంటారు అని అన్నారు. పొగరులేటి డిఫెన్స్‌లో పడ్డాడు.. రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ అధినేతగా మాట్లాడారు.. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలనుకున్నాడు.. నేనొక్కన్నె అవినీతిపరుడను కాదు… సీఎం, భట్టి,  జూపల్లి కృష్ణారావు స‌హా మంత్రులంద‌రి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు అని  అ న్నారు. పొంగులేటి కాదు.. పొంగు’లూటీ’ అని ఆయనే చెప్పకనే చెప్పిండు.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో జరిగిన అవినీతిని మా అధికారులే గుర్తుపట్టారు.. ఫైన్ కూడా కట్టారని  ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారు.. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పీసీబీ, మైనింగ్ శాఖల అధికారులు మైనింగ్ తనిఖీ చేసి అక్రమ మైనింగ్ అని నిర్ధారించారు.. పొంగులేటి చెప్పింది తప్పా.. అధికారులు చెప్పింది తప్పా.. ముఖ్యమంత్రి చెప్పింది తప్పా.. మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా అని హరీష్‌రావు ప్రశ్నించారు. నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావు.. పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్నీ బయటపెడతాం అంటూ పొగరు తగ్గించుకో అని హితవు పలికారు. పొంగులేటి రాఘవకు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదు…అసెంబ్లీలో ఉండి కూడా నాది కాదని చెప్పలేదు.. సీఎం, మైనింగ్ మంత్రిది తప్పు అని చెప్పు.. కంటైనర్ మీద రాఘవ కన్‌స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది అని నిలదీశారు. పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి తీసుకున్న కాపీని నేను అసెంబ్లీలో చూపెట్టాను.. అసెంబ్లీలో వాస్తవాలు ఎందుకు చెప్పలేదన్నారు. నాదర్‌గుల్ భూములు కాపాడింది బీఆర్ఎస్ పార్టీ.. నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్.. హైకోర్టులో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది.. సీలింగ్ భూములు అమ్మినవారి మీద, కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్ఎస్.. ఎందుకు దాచిపెడుతున్నావు అని అన్నారు. డివిజన్ బెంచ్‌లో కేసు గెలిచింది బీఆరఎస్ ప్రభుత్వం కాదా అన్నారు. మీరు చెప్పినట్లు నేడు అవి ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుంది.. రెండున్నరేళ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.. ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయి అని నిలదీశారు. శిల్పతో రాఘవ కంపెనీకి సంబంధాలున్నాయా లేవా? ఏ క్యూ స్క్వేర్‌తో సంబంధాలు నిజామా కాదా అని అడిగారు. అవి ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ఆర్డీవో ఏం చేస్తున్నారు నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే అక్రమణదారులపై చర్యలు తీసుకోండి అని కోరారు. పొంగులూటి.. నీ బాంబులు అన్నీ తుస్సుమన్నాయి.. హైడ్రాను పంపి చిత్తశుద్ధి నిరూపించుకో.. తప్పు అయితే నాలుగు శాఖల మీద చర్యలు తీసుకో.. సీఎం అసెంబ్లీలో అబద్ధం ఆడారు అని చెప్పించు.. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పు అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *