హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2:డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 17 నుండి మార్చి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు పరీక్షకు మూడు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.inలో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా వెబ్ సైట్ www.braou.ac.inలో సంప్రదించొచ్చని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





