పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట

– నట్టల నివారణ మందు పంపిణీ లో మంత్రి అడ్లూరి 

జగిత్యాల,ప్రజాతంత్ర,డిసెంబరు27: రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచిందన్నారు. శనివారం నక్కలపేటలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో నట్టల నివారణకు ప్రభుత్వం రూ.4,43,70,974 ఖర్చు చేస్తుందన్నారు.  వ్యాధులు తగ్గి జీవాల మరణాలు అదుపులో ఉంటాయన్నారు.  రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో పశుపోషకుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు హా ఇచ్చారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి, గొర్రెల పెంపకం చేపట్టాలన్నారు. ఇచ్చిన హాలను నెరవేరుస్తున్నామని అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *