బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు

– దైవదూషణ పేరుతో హిందూ యువకుడి దారుణ హత్య
– సంతాపంతో సరిపెట్టిన అధ్యక్షుడు యూనస్‌

‌ఢాకా, డిసెంబరు 19: బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు మరోమారు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపారు. ముఖ్యంగా రాడికల్‌ ‌శక్తులు హిందువులను టార్గెట్‌ ‌చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. మైమన్‌సింగ్‌ ‌జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవ దూషణ చేశాడనే ఆరోపణతో కొట్టి చంపడం సంచలనంగా మారింది. బాధితుడిని 30 ఏళ్ల దీపు చంద్ర దాస్‌గా గుర్తించారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అతడిపై దాడి జరిగింది. అయితే ఈ హింసపై బంగ్లాదేశ్‌ ‌తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్‌ ‌యూనస్‌ ‌స్పందించారు. మైమెన్సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యూ బంగ్లాదేశ్‌లో ఈ రకమైన హింసకు చోటు లేదు. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఎవరినీ వదలబోము అని ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింస పట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్‌ ‌కీలకమైన సమయంలో చరిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన గుండా వెళ్తోందని, గందరగోళ ప్రయత్నాలను సృష్టించి దేశం అశాంతి వైపు ప్రయనించడాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.షేక్‌ ‌హసీనా అవామీ లీగ్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన, భారత వ్యతిరేకిగా పేరుగాంచిన విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ ‌హాదిపై కొన్ని రోజుల క్రితం ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జ‌రిపారు. ఆయన తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటూ మరణించాడు. మరోవైపు, రాడికల్‌ ‌శక్తులు బంగ్లాలోని మీడియా సంస్థలైన ది డైలీ స్టార్‌, ‌ప్రొథోమ్‌ అలోలపై దాడులు జరిపాయి. ఈ క్ర‌మంలో ప్రభుత్వం మాట్లాడుతూ తాము జర్నలిస్టులతో ఉన్నామని, ఉగ్రవాదం, హింస జ‌ర‌గ‌డంపై తీవ్రంగా క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *