-కూకట్‌పల్లి వద్ద మెడకు చుట్టుకుని బాలిక మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్ జాతీయ రహదారి వద్ద గాలిపటం చైనా మాంజా ఐదేళ్ల చిన్నారి నిష్విక ఆదిత్య మెడకు బలంగా చుట్టుకుంది. ఒక్కసారిగా చిన్నారి కేకలు వేయడంతో తండ్రి బైక్ ఆపి చూసేసరికి, మాంజా కోసుకుపోవడంతో మెడ భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం సపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇలాంటి ప్రమాదకర దారాలను వాడటం వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



