– దిగుమతుల సుంకాలను తిరిగి చెల్లించాల్సిందే
– అమెరికన్ ట్రేడ్ కోర్టు తీర్పు
వాషింగ్టన్, మార్చి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లను సుప్రీం కోర్టు రద్దు
చేసింది. ఇకపై ఈ టారిఫ్‌ల వసూళ్లు నిలిపివేయాలని కోర్టు అధికారులకు ఆదేశించింది. అయితే, ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను తిరిగి ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ట్రేడ్ కోర్టు తీర్పుతో ఆ విషయంపై స్పష్టత వచ్చింది. అట్మస్ ఫిల్టేష్రన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్, ఈ సుంకాలు చెల్లించిన దిగుమతిదారులు రీఫండ్ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల రీఫండ్‌కు సంబంధించిన కేసులను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాలు సాధారణంగా ’లిక్విడేషన్’ అనే పక్రియ ద్వారా ఖరారు అవుతాయి. ఈ పక్రియలో కస్టమ్స్ అధికారులు నిర్ణయించిన సుంకాలపై దిగుమతిదారులు అభ్యంతరం వ్యక్తం చేయడానికి 180 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువు దాటితే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే. ఇప్పటికే లిక్విడేషన్ పక్రియ పూర్తయిన దిగుమతుల విషయంలో కూడా టారిఫ్‌లు లేకుండా కొత్తగా లెక్కలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, ప్రపంచ దేశాలపై సుమారు 15 శాతం వరకు కొత్త సుంకాలను విధించే ప్రతిపాదన ఈ వారం అమల్లోకి రావొచ్చని అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





