హ్యాం రోడ్ల పేరిట మ‌రో కుంభకోణం

– హరీశ్ రావు, వేముల చిట్‌చాట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆరఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఆరోపించారు. అసెంబ్లీ వద్ద మంగళవారం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ ఆర్ అండ్‌బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.6000 కోట్లు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారని, రూ.1800 కోట్లు నేరుగా వస్తాయని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారని వ్యాఖ్యానించారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదని, రోడ్లకు గుంతలు పడినా మరమ్మతులు చేయడం లేదని, కమీషన్ల కోసం హ్యాం రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయి కానీ ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయన్నారు. సీవోటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారన్నారు. బీఆరఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసిందని, నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే ఇప్పుడు పది శాతం పెట్టారని, మొత్తం 34 లో ఇప్పటివరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని తెలిపారు. ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారన్నారు. పంచాయతీరాజ్‌లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యాం రోడ్లకు దాన్నిఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చునని తెలిపారు. నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని, నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని వారు చెప్పారు. రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని, టెండర్లలో సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మÅ£్కయ్యాయన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 7 వర్కుల్లో సివేట్‌కు 3, జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో టెండర్ సివేట్, బృందాకు ఇచ్చారన్నారు. అందువల్ల టెండర్లు రద్దు చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామన్నారు. టెండర్లలో పాలుపంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హరీష్, వేముల హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి పారదర్శంగా నిర్వహించాలని సవాల్ చేశారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆరఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *