లాయర్ స్వప్న హ‌త్య‌ కేసులో మరొక‌రి అరెస్ట్

– ఇప్పటికే ఆమె అన్న సహా నలుగురి అరెస్ట్
– హత్యకు ఉపయోగించిన కార్లు, ఫోన్లు స్వాధీనం
– భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల వెల్లడి

రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గొటికె స్వప్న ఫిబ్రవరి 4న మొయినాబాద్ సమీపంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. స్వప్న హత్యకు భూ వివాదమే కారణమని నిర్దారించారు. హత్యకు పాల్పడిన నలుగురిలో ప్రధాన నిందితుడు స్వప్న సొంత అన్న గోటికె రాజు. అతను మరో ముగ్గురు సహచరులతో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పారు. సర్వే నం,339లోని నాలుగెకరాల భూమిపై వివాదం ఉందని, భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో నిందితులు స్వప్నపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. మొదట కారుతో ఢీకొట్టి, తర్వాత రాళ్లు, కర్రలతో దాడి చేసి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. అనంతరం ఇన్నోవా కారు, స్కూటీపై నిందితులు పరారయ్యారని, వాటిని సీజ్ చేశామని, నిందితుల మొబైల్ ఫోన్లు, హత్యకుపయోగించిన కొడవలిని కూడా సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. స్వప్న లొకేషన్ వివరాలు ఎప్పటికప్ప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ రెండుసార్లు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు విచారణలో రాజు ఒప్ప్పుకున్నాడన్నారు. ఒకసారి కారుతో, మరోసారి బుల్డోజర్‌తో స్వప్నను ఢీకొట్టించేందుకు రాజు య‌త్నించాడ‌ని, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు ప్లాన్ చేయగా రెండుసార్లూ స్వప్న తప్పించుకున్నట్లు వివరించారు. సీసీ కెమెరాలు లేని ప్రదేశాలు చూసి స్వప్నను వెనుక నుంచి ఢీకొట్టేందుకు రాజు ప్లాన్ చేశాడని, ప్లాన్ సక్సెస్ చేసేందుకు తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడని, ఈ రోడ్డు ప్రమాదం కేసులను హత్యాయత్నం కేసులుగా మార్చనున్నట్లు ఆయన చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *