హుస్నాబాద్ అభివృద్ధిలో మరో కీలక అడుగు

– కొత్త చెరువు అభివృద్ధికి రూ.7.49 కోట్లు
– ఎల్లమ్మ చెరువు కాలువల పునరుద్ధరణకు రూ.2.74 కోట్లు

సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. హుస్నాబాద్ కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం ఇరిగేషన్ శాఖ నుంచి రూ.7 కోట్ల 49 లక్షల 10 వేలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అడ్డుకట్టతో పాటు నీటిపారుదల కాలువల పునరుద్ధరణకు రూ.2 కోట్ల 74 లక్షలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో చెరువుల అభివృద్ధి, కాలువల బలోపేతం జరగడంతో వ్యవసాయానికి సాగునీరు సమృద్ధిగా అందడంతో పాటు భూగర్భ జలమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కొత్త చెరువు పునరుద్ధరణ పూర్తయితే హుస్నాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు సాగునీటి భద్రత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. కొత్త చెరువు అభివృద్ధికి రూ.7.49 కోట్లు, ఎల్లమ్మ చెరువు కాలువల పునరుద్ధరణకు రూ.2.74 కోట్లు నిధులు కేటాయించడంపై హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హుస్నాబాద్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులు పూర్తయితే రైతులకు శాశ్వత సాగునీటి భద్రత లభిస్తుందని, ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *