అమెరికాకు మరోమారు తప్పని షట్‌డౌన్

 – బడ్జెట్ ఆమోదానికి అర్ధరాత్రితో ముగిసిన గడువు

వాషింగ్టన్, జనవరి 31 : అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నట్లు అంతర్జాతీయ విÖడియా శనివారం వెల్లడించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో ప్రభుత్వం మరోసారి షట్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువును కాంగ్రెస్ దాటవేయడంతో ప్రభుత్వం శనివారం పాక్షికంగా షట్ డౌన్ అయింది. దీంతో పలు సేవలు నిలిచిపోనున్నాయి. షట్‌డౌన్ స్వల్పకాలికంగా ఉండవచ్చని సెనేటర్లు చెబుతున్నారు. మరోవైపు గడువుకు ముందు బడ్జెట్‌పై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో తాత్కాలిక లేదా పూర్తి`సంవత్సర నిధుల చర్యను కాంగ్రెస్ ఆమోదించే వరకు కీలకం కాని పలు ప్రభుత్వ కార్యకలాపాల్ని నిలిపేస్తున్నారు. సభ తిరిగి సమావేశం అయ్యాక సెనేట్ మద్దతు ఉన్న ఒప్పందాన్ని ఆమోదించడానికి తగినంత మద్దతును కూడగట్టడానికి చట్టసభ సభ్యులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికాలో దాదాపు మూడోవంతు ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. విద్య, ఆరోగ్యం, గహ నిర్మాణం, రక్షణను నిర్వహించే అనేక ఏజెన్సీలలో షట్‌డౌన్ చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విభాగాలు రాత్రికి రాత్రే షట్‌డౌన్ ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించాలని భావించాయి. కానీ ఇది తాత్కాలికమేనన్న అంచనాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నాయి. వచ్చే వారం ప్రారంభంలో కాంగ్రెస్ ఊహించిన విధంగా ప్యాకేజీని ఆమోదిస్తే కొన్ని రోజుల్లో నిధుల పునరుద్ధరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. షట్‌డౌన్ కొనసాగితే మాత్రం పదివేల మంది ప్రభుత్వ కార్మికులు జీతం లేని సెలవును ఎదుర్కోవలసి రావచ్చు, లేదా నిధులు అందేవరకు జీతం లేకుండా పని చేయాల్సి రావచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *