– మోసపోయిన మాజీ డీజీపీ మనవరాలు
– నకిలీ వాట్సాప్ మెసేజ్ తో టోకరా
– ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెద్దపెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేయడం ఇప్పుడు నేరగాళ్లకు పరిపాటిగా మారింది. తాజాగా హైదరాబాద్ ఒక ఉన్నతస్థాయి మహిళా వ్యాపారవేత్త,మాజీ డీజీపీ మనుమరాలిని భారీగా మోసగించారు. ఈ ఘటన మరోసారి సైబర్ నేరగాళ్ల చాకచక్యాన్ని బయటపెట్టింది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెతో పాటు అకౌంటెంట్ను మోసం చేశారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరు, ఫొటోతో ఉన్న వాట్సప్ ఖాతా నుంచి అకౌంటెంట్కు మెసేజ్ వచ్చింది. తాను టింగ్లో ఉన్నానని… చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని అందులో ఉంది. దీంతో అకౌంటెంట్ ఆ డబ్బును పంపారు. ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఈ క్రమంలో డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం డైరెక్టర్ ని అకౌంటెంట్ సంప్రదించారు. గతంలో చేసిన రూ.1.20 కోట్ల లావాదేవి వివరాలను అకౌంటెంట్ చెప్పారు. తాను ఎవరికీ డబ్బు పంపమని చెప్పలేదని దివ్యారెడ్డి స్పష్టతనిచ్చారు. వెంటనే బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైంపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఈ నెల 13న మహిళా వ్యాపారవేత్త పేరు, ఫొటోతో ఒక ఫేక్ వాట్సాప్ అకౌంట్ సృష్టించారు. ఆ అకౌంట్ నుంచి ఆమె సంస్థలో పనిచేసే అకౌంటెంట్ కు మెసేజ్ పంపించారు. ‘మీటింగ్ లో ఉన్నానని, వెంటనే ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి’ అంటూ తెలిపారు. ఆ సందేశాన్ని నిజమని నమ్మిన అకౌంటెంట్ ఎలాంటి అనుమానం లేకుండా ఒకే ట్రాన్సాక్షన్ లో రూ.1.20 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మోసం వెంటనే బయటపడలేదు. ఈ నెల 17న అదేవిధంగా మరోసారి మెసేజ్ వచ్చింది. ఈసారి డబ్బులు పంపేముందు అకౌంటెంట్ చెక్ అప్రూవల్ కోసం మహిళా వ్యాపారవేత్తను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. నేను ఎలాంటి డబ్బు పంపమని చెప్పలేదు అని ఆమె చెప్పడంతో ముందే జరిగిన ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకుని మహిళా షాక్ కు గురయ్యారు. మోసం తెలిసిన వెంటనే బాధితురాలు 1930 నంబర్ ద్వారా సైబర్ హెల్ప్ డెస్క్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా కంప్లెంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ విచారణలో భాగంగా కేరళకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఈ ఘటన నేపథ్యంలో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల రూ.1.20 కోట్ల నష్టం జరిగిందని, అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



