మరో ఉప ఎన్నిక అనివార్యమా?

– సుప్రీంకోర్టు నిర్దేశంతో కాంగ్రెస్ నేతల కొత్త వ్యూహం
– ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా కోరే అవకాశం
– స్పీకర్కోర్టును ధిక్కరణ నుంచి తప్పించే వ్యూహం
– జూబ్లీ విజయంతో కాంగ్రెస్లో పెరిగిన ఆత్మవిశ్వాసం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీ భవన్ (తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం) వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు త్వరలోనే రా ష్ట్రంలో ఒకటి లేదా రెండు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు రావచ్చని తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సు ప్రీంకోర్టు ఇటీవల గట్టి ఆదేశాలు జారీ చే సింది. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. గతంలో స్పీకర్ కోరిన అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు నిరాకరించడం, ఒక వారం మాత్రమే గడువు ఇవ్వడంతో స్పీకర్ కార్యాలయంపై ఒత్తిడి పెరిగింది. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి , స్పీకర్ను కోర్టు ధిక్కరణ నుంచి తప్పించడానికి, అలాగే అనర్హత అంశాన్ని మరింత సమయం తీసుకుని పరిశీలించడానికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒక కీలకమైన వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కనీసం ఇద్దరిని రాజీనామా చేయమని లేదా అనర్హత వేటును అంగీకరించమని అడగాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. రాజీనామా లేదా అనర్హత ద్వారా ఉప్ప న్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక్కరు దానం నాగేందర్ (ఖైరతాబాద్) కాగా రెండవవారు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్). దానం నాగేందర్ మొదట బీఆర్ ఎస్ఎ మ్మెల్యేగా గెలిచిన తర్వాత, జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ, లోక్సభ ఎన్నికల్లో బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అదే సమయంలో జరిగిన పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కో-ఆర్డినేటర్లలో ఒకరిగా కూడా నియమితులయ్యారు. మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు బహిరంగంగా ప్రకటించకపోయినా. కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు దిగిన ఫోటోలు వారు తమ విధేయతను మార్చుకున్నారనే స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాయి. వీటి ఆధారంగానే బీఆర్ ఎస్ నాయకత్వం వారిపై అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమకు ప్రజల్లో సానుకూలత ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సానుకూల పరిస్థితుల మధ్య మరో ఉపఎన్నికను నిర్వహించడం వలన తమకు ఎలాంటి రాజకీయప రమైన నష్టం ఉండదని, పైగా తమ బలాన్ని మరింత నిరూపించుకోవచ్చని వారు నమ్ముతున్నారు. అందుకే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే ఉత్తమమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనర్హత వేటు పడటం కంటే రాజీనామా చేయడం అనేది ప్రజల దృష్టిలో మరింత ఆమోదయోగ్యంగా. నైతికపరంగా మెరుగైన చర్యగా పరిగణించబడుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *