లోకాయుక్త అమలులో విఫలం

– మరోమారు దీక్షకు అన్నా హజారే నిర్ణయం
– స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో 30న దీక్ష

పుణె, డిసెంబర్ 12: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోమారు నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే వెల్లడించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన ఆరోపించారు. ప్రజా సంక్షేమానికి ఈ చట్టం చాలా కీలకమని.. అయితే పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ దానిని విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు 88 ఏళ్ల హజారే తెలిపారు. ఇప్పుడు తాను చేపట్టే నిరాహార దీక్షయే తన ఆఖరి నిరసన అవుతుందేమోనన్నారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే 2022లో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేశారు. లోకాయుక్తను అమలు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఓ కమిటీ చట్టాన్ని రూపొందించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *