కేంద్ర మంత్రి అం‌జన్న ఆశీర్వాద యాత్ర

– కరీంనగర్‌ ‌మహాలశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు
– స్థానిక కార్పోరేటర్లతో కలిసి పదివేలమంది నడక
– రాజకీయాలకు సంబంధం లేదన్న బండి సంజయ్‌ ‌
– కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి14:కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్ ‌వెల్ల‌డించారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అం‌జన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రితోపాటు ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు ఉన్నారు. కరీంనగర్‌ ‌మేయర్‌ ‌పీఠం బీజేపీ కైవసమైతే కరీంనగర్‌ ‌లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్‌ ‌ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి సంజయ్‌ ‌పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ’అంజన్న ఆశీర్వాదం’ పేరుతో శనివారం మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్‌ ‌మహాశక్తి అమ్మవారి దేవాలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 40 కిలోటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం కొండగట్టుకు ఈ పాదయాత్ర చేరుకోనుంది. బీజేపీ శ్రేణులు ఈ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పది వేలమంది పాల్గొనేలా ప్లాన్‌ ‌చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌లో విజయం సాధించామని పేర్కొన్నారు. మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు ఈ పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్‌ ‌వివరించారు. పదోతరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పాదయాత్ర కొనసాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌ ‌తమ ఎన్డీయే కూటమి మిత్రుడేనని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నిధులను పవన్‌ ‌కల్యాణ్‌ ‌కేటాయించారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రసాదం స్కీమ్‌ ‌కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ ‌హయాంలో చెప్పారని.. కానీ చర్యలు మాత్రం చేపట్టలేదని ఆగ్రహించారు. ఎంఐఎంను తాము భూస్థాపితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు. ’సర్వేజన సుఖీనోభవంతు మా నినాదం’ అని చెప్పుకొచ్చారు. తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌ ‌హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. హిందువుల గురించి అనుచితంగా మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్‌ ‌సర్కార్‌లో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మళ్లీ ఎలా గెలిస్తారో చూస్తామని హెచ్చరించారు. తుంగతుర్తిలో ఆయన పతనం ప్రారంభ మైందని ధ్వజమెత్తారు. హిందు దేవుళ్లను మోసం చేసి మరో దేవుడు దగ్గరకు ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే ద మత విధ్వేషాలను రెచ్చిగొట్టినందుకు కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *