- బుజ్జగించిన కాంగ్రెస్ పెద్దలు
– కలసి పనిచేయాలని నిర్ణయం
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్10: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ నాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ బుజ్జగించారు. అంజన్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో టికెట్‌ను వేరే వాళ్లకు కేటాయించాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయనకు వివరించారు. అనంతరం అంజన్‌తో పాటు పొన్నం ప్రభాకర్ డియాతో మాట్లాడారు. పార్టీ చర్యలతో మనస్తాపానికి గురైనట్లు అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కనపెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. నేనెప్పుడూ ఓడిపోలేదు.. అందరూ కలిసి ఓడగొట్టారు. నాకు టికెట్ ఇస్తే గెలిచేవాడిని. కరోనాతో వెంటిలేటర్‌పై వైద్యం చేయించుకున్నా. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను. రెండు సార్లు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశం అని అంజన్‌కుమార్ అన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ యాదవ్ పోటీచేయాలని భావించారని.. అధిష్ఠానం వేరేవాళ్లకు టికెట్ కేటాయించిందన్నారు. కరోనా సమయంలో అంజన్‌కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని.. ఆయన కూడా కరోనా బారిన పడ్డారని చెప్పారు. నగరంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని, అంజన్ సారథ్యంలోనే ఎన్నికల్లో పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఉప ఎన్నికలో అందరం కలిసి పనిచేస్తామని పొన్నం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



