– డాక్టర్ అనితా రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: పండుగ అంటే అందరినీ కలుపుకుని ఆనందంగా జరుపుకునేదని కాకతీయ వర్సిటీ పాలకమండలి సభ్యురాలు, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి చెప్పారు. హన్మకొండ ప్రభుత్వ దివ్యాంగ బాలికల ఆశ్రమాన్ని బుధవారం సందర్శించి పిల్లలకు అమ్మ ప్రేమని అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వారికి స్వీట్లు, స్నాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల సేవ చేయడం దైవ సేవ అన్నారు. తమకు అందరూ ఉన్నారన్న భావన కల్పించేందుకు పండుగ రోజు వచ్చానన్నారు. వీరితో పండుగ సంబరాల కంటే సంతృప్తి, ఆనందం తనకు ఇంకేమీ ఉండవని అన్నారు. విద్యార్థులు చదువును అశ్రద్ధ చేయవద్దని, ఓ లక్ష్యం పెట్టుకొని చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఉద్బోధించారు. వారితో గడపడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆశ్రమం సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





