అంగన్‌వాడి కేంద్రాలకు దసరా సెలవులు

– రేపటినుంచి 8 రోజులపాటు సెలవులు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు మంజూరు చేసింది. ఐఎన్టీయూసీ అనుబంధ ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ బి. అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ఇటీవల కలిసి దసరా సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవుల కాలంలో టేక్‌ హోమ్‌ రేషన్‌ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేశారు. తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీత క్కకు యూనియన్‌ ప్రతినిధులు, అంగన్‌వాడీలు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *