ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ సెంటర్లు

– ఇసామియా బజార్‌లో ప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: నగరంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో అంగన్‌వాడి కేంద్రాలు లేవని, స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణం కష్టమవుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
అయినప్పటికీ రద్దీ ప్రాంతమైన ఇస్సామీయా బజార్‌లో రూ.16.5 లక్షలతో అంగన్‌వాడి పూర్వ ప్రాథమిక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. చిన్నారులతో రిబ్బన్ కట్ చేయించి అంగన్‌వాడి కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభింపచేశారు. సీతక్కచిన్నారుల సంతోషమే మన సంతోషం అని, అత్యాధునిక£ పద్ధతిలో ఈ అంగన్‌వాడీ కేంద్రం ఉందని, ఈ కేంద్రంలో డిజిటల్ బోర్డుల ద్వారా ప్రీ ప్రైమరీ పాఠాలు నేర్చుకోవచ్చునని తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాలంటే కేవలం ఆటపాటలు, న్యూట్రిషన్ ఫుడ్డే కాదు.. ఇక్కడ ప్రీ ప్రైమరీ నర్సరీ క్లాసులు నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ ప్లే స్కూళ్ల్లకు దీటుగా రూపుదిద్దుతున్నామని చెప్పారు. చిన్నారులకు యూనిఫాంలు ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు ప్రతిరోజూ 100 ఎంఎల్ విజయ పాలను, అల్పాహారాన్ని అందజేస్తామని వివరించారు. పిల్లలు చిన్నతనంలో ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో అద్భుతంగా రాణిస్తారన్నారు. ప్రైŸవేట్ ప్లే స్కూల్లో చేర్చితే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. అంగన్వాడి కేంద్రాల్లో మీ చిన్నారులను చేర్చి ఆర్థిక భారాన్ని తగ్గించుకోండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మహిళల భద్రత, స్వావలంబన కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్

హైదరాబాద్ నగరంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఉద్యోగం, విద్య కోసం నగరాలకు వచ్చే మహిళలకు భద్రతతో కూడిన, సౌకర్యవంతమైన నివాస వసతి కల్పించడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఆ అవసరాన్ని గుర్తించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు రూ..200 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం చేపడుతున్నామని, ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ నిర్మించబోతున్నామని, ఒక్కో హాస్టల్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లT ఖర్చు చేస్తూ ఒక్కో హాస్టల్‌లో కనీసం 500 మంది మహిళలు నివసించే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇది మహిళల ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో, వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహిళల భద్రత, జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలుపు కోసం తాను ఇక్కడ ప్రచారం చేసినప్పుడు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చామని, ఇక్కడ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేయడమే కాÅ£, వడ్డెర సామాజికవర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చామని, ఈ రోజు వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌కు శంకుస్థాపన చేసి ఆ హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేశామని అన్నారు. త్వరలోనే వడ్డెర కులస్తుల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభించి అందిస్తామని సీతక్క హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *