– అందెశ్రీ మృతికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక రంగంలో తన పాటలతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలి :హరీష్‌రావు
అందెశ్రీ మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





