కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైనదని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు పెరిగినపటికీ, సహజ సిద్దమైన డైమండ్ విలువైనదన్నారు. పూర్వికులు ఎప్పుడో కనిపెట్టారన్నారు. జ్యోతిష్యంలో డైమండ్ ధారణ ప్రాధాన్యత ఉందన్నారు. భారతీయ డైమండ్ మార్కెట్ ప్రపంచంలో చాలా పెద్దదన్నారు. నైపుణ్యంతోనే ముడి గ్రాఫైట్ నుంచి వజ్రం వస్తుందన్నారు. సముద్రం లోపల వజ్రాలు ఉండవని అన్నారు. వ్యవసాయ భూములు, నది పరీవాహక ప్రాంతాలు డైమండ్లు లభించవన్నారు.
ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నందుల రఘురామ్ మాట్లాడుతూ “నిలకడ అభివృద్ధి ఒక అరుదైన వస్తువు” అని తెలుపుతూ ఆహార ఉత్పాదకతకు అత్యవసరమైన నత్రజని, భాస్వరం సమ్మేళనాలు వ్యవసాయం, వ్యర్థ పదార్థ నిర్వహణలో సరిగా ఉపయోగించుకోక పర్యావరణ సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. పోషకాలు నేల, నీరు, గాలిలో కలుషితం వల్ల జీవవైవిధ్య నష్టం జరుగుతుందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ఆవిష్కరణలు, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ దృక్పథం అత్యంత కీలకమని రఘురాం తెలిపారు. ప్రధానంగా స్థిరమైన పోషక వనరుల నిర్వహణ అంశాలను ఎత్తి చూపారు. వ్యవసాయంలో నత్రజని, భాస్వరం ఉపయోగించుకోకపోవడంతో అమ్మోనియా, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణంలోకి నైట్రేట్లు, ఫాస్ఫేట్లు నీటిలోకి కలిసిపోతున్నాయని ఆందోళన చెందారు. పరిశ్రమ, రవాణ సెక్టార్లలో ఇంధన దహనం వలన వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ తో అమ్ల వర్షాలకు కారణమవుతున్నాయన్నారు. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ కంటే 270 రెట్లు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ కలిగిన శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువని అన్నారు. దీంతో వాతావరణ మార్పును వేగవంతం చేస్తుందన్నారు. మానవ నిర్మిత కార్యకలాపాల ద్వారా పోషకాల సహజ చక్రాలు భగ్నమవుతాయన్నారు. తెలంగాణకు ఉన్న అవకాశాలు, సూచనలు వివరించారు. తెలంగాణలో మార్పు తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయనన్నారు. వ్యవసాయం, వ్యర్థ పదార్థ నిర్వహణ, పర్యావరణాన్ని మార్చే అవకాశం ఉందని సూచించారు. వ్యవసాయ పద్ధతులలో మార్పునేలలో సహజ నత్రజనిని పెంచే పప్పుధాన్యాల పంటలను పునరుద్ధరించవచ్చన్నారు. పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించటకు ఆహార భద్రతను నిర్ధారించడానికి స్థిరమైన పోషక వనరుల నిర్వహణ ఒక కీలకమైన్నారు.





