అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

– పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి

వికారాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 25: అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖa మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వికారాబాద్‌ జిల్లాకు వొచ్చిన మంత్రి జూపల్లికలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు అనంతగిరి హరిత రిసార్ట్స్‌, అనంతగిరి వ్యూ టవర్‌ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరిత హోటల్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద పరిగణిస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్‌ రిసార్ట్స్‌ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత హోటల్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. టూరిస్టులకు సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు హ్యాండ్‌ ఓవర్‌ చేసి వొచ్చే టూరిస్ట్‌లకు మంచి ఆహారం అత్యాదునిక సౌకర్యాలను కల్పించాలని యువతీయువకులకు ఉపాధి కల్పించే విధంగా హరిత హోటల్‌ ను అప్పగించడం జరుగుతుందని ఆయన అన్నారు. కలెక్టర్‌ తక్షణమే చర్యలు తీసుకొని హరితహోటల్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పర్యాటక దృష్టిలో వికారాబాద్‌కి ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని అనంతగిరి పర్వతాల అందాలు హరిత రిసార్ట్స్‌ సౌకర్యాలు వ్యూ టవర్‌ కు ఆకర్షితులవుతారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌ టూరిజం ఈడి ఉపేందర్‌ రెడ్డి, డిఇ హనుమంత్‌ రెడ్డి, కాంట్రాక్టర్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *