మొన్న మే 31 న హైదరాబాద్ లో జరిగిన ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరమ్ (టిజెఎఫ్) ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం- రజతోత్సవాల ప్రారంభం వేలాది మంది పాత్రికేయుల మధ్య ఉద్యమజ్ఞాపకాల ఉద్వేగంతో, ఒక పునస్సమాగమ ఉత్సాహంతో జరిగింది. అంతటి సందోహాన్ని చూసి నిర్వాహకులు, ప్రేక్షకశ్రోతలు అందరూ ఆశ్చర్యపోయారు.
చాలా కాలం అయింది కదా, తెలంగాణ ఉద్యమాన్ని తలపోసుకుని! విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, న్యాయవాద సంఘ నాయకులతో పాటు, నాటి రాజకీయ జెఎసి నేత కోదండరామ్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ తరువాత వేరు వేరు మార్గాలలో నడుస్తున్న వారు ఈ వేదికను పంచుకున్నారు. 2014 కంటె ముందు జరిగిన ఉద్యమసంఘటనలను, అనుభవాలను, అందులో జర్నలిస్టుల ఫోరమ్ నిర్వహించిన కీలకపాత్ర ను వక్తలందరూ తమ ప్రసంగాలలో జ్ఞాపకం చేసుకున్నారు. వర్తమానంలో తెలంగాణ పరిస్థితిని, అందుకు రెండు దఫాలు పాలించిన ప్రభుత్వం బాధ్యతను, ప్రస్తుత ప్రభుత్వం తీరును కూడా కొందరు వక్తలు ప్రస్తావవశంగా చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ నేతగా అల్లంనారాయణ, పాత్రికేయుల సమన్వయ పాత్రను గుర్తు చేసుకుంటూ, ఆ చరిత్రాత్మక ఘట్టం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు.
కారణాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చును కానీ, తెలంగాణ ఉద్యమోత్సాహం, ఆ నాటి ఐకమత్యం ప్రస్తుతం లోపించాయన్నది వాస్తవం. కలసికట్టుగా సాగిన ఆ నాటిపోరులోని ఉద్విగ్న ఘట్టాలను స్మరిస్తూ, ఎన్. వేణుగోపాల్ కొంత ఉత్సాహాన్ని, కర్తవ్యస్పృహను కలిగించారు. మిత్రులు శైలేష్ రెడ్డి గట్టిగా గుర్తుచేసిన తరువాత కానీ, సభాప్రాంగణంలో ‘జై తెలంగాణ’ నినాదాలు వినిపించలేదు. ఏదో ఒక నిర్లిప్తతలో ఉన్నట్టు కనిపించిన పాత్రికేయ మిత్రులు, ఒకరినొకరు పలకరించుకుని పాతజ్ఞాపకాలు నెమరువేసుకోవడంలో మాత్రం ఆనందపడ్డారు. ఆ ఆనందంలో, కొన్ని ఆకాంక్షలు, మళ్లీ పాతరోజులను పునరుద్ధరించగలమన్న ఆశలు కనిపించకపోలేదు.
తెలంగాణలో విలువల, ఆశయాల ఆధారిత శక్తులు ఇంకా బలంగానే ఉన్నాయి. ఆపరేషన్‌కగార్ కు వ్యతిరేకంగా, తెలంగాణ సమాజంలోని విస్తృత శక్తులు ప్రదర్శనలు చేస్తున్నాయి, గొంతు విప్పు తున్నాయి. దురదృష్టవశాత్తు, జాతీయస్థాయిలో అటువంటి పౌరసమాజం బలహీనంగ ఉండడం వల్ల కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడీ పడడంలేదు., ఆపరేషన్ క్షేత్రం బయటి రాష్ట్రంకావడం వల్ల తెలంగాణ గొంతు సరిహద్దులలోపలే అణగారిపోతున్నది. కానీ, రాష్ట్రసంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద విశాలసమాజం పనిచేయగలిగితే మంచి ఫలితాలను సాధించగలుగుతుంది. బనకచర్ల వివాదం మీద తెలంగాణ నుంచి ఎందుకు ఒక జెఎసి ఏర్పడకూడదు? లేదా, తెలంగాణలో ప్రజానుకూల అభివృద్ధి విధానాల సాధనకు ఒక విశాల ఐక్యకార్యాచరణ సమితి ఎందుకు పనిచేయగూడదు?
వక్తలు కొందరు ఆ ఆశలను తమ ప్రసంగాలలో వ్యక్తం చేశారు కూడా. ఉద్యోగసంఘాల నాయకులు, దేవీప్రసాద్, విఠల్, విద్యార్థి నాయకులు, రాజారాం యాదవ్, కోటశ్రీనివాస్, దుర్గం భాస్కర్, మాట్లాడిన మాటలు వేరువేరు అయి ఉండవచ్చును కానీ, మళ్లీ ఏమన్నా కొత్తగా చేయాలన్న కోరికను ప్రకటించినవారే. అలనాటి ఐక్యకార్యాచరణ వేదికలు, జర్నలిస్టుల సంధాన కృషిని చెబుతూ, వర్తమానంలో అటువంటి ప్రయత్నాల ఆవశ్యకతను కోదండరామ్ చెప్పారు. ఏ ఉద్యమసమాజమూ కేవలం జ్ఞాపకాలను తడుముకుని ఊరుకోలేదు. పునరుజ్జీవిస్తూ ఉండాలనే అనుకుంటుంది.
ఒక ఉమ్మడి ఆశయం కోసం కలసికట్టుగా పనిచేసిన వారు, అది నెరవేరిన తరువాత, తిరిగి తమ వేరు వేరు బాటలలోకి మళ్లడం సహజమే. ఆర్‌ఎస్‌యు నుంచి ఆర్‌ఎస్‌ఎస్ దాకా అందరిని కూడగట్టి ఉద్యమం సాగించాలని జయశంకర్ సార్ అనుకున్నారు, అదే విధంగా, తెలంగాణ సకలజన సమాజమూ వేరువేరు సమూహాలుగా ఐక్యమవుతూ, ఒకే ఉద్యమపాయలోకి వచ్చి చేరింది. ఉద్యమం పతాకదశకు చేరుకున్నప్పుడు, అనేక సృజనాత్మక రూపాలలో, ప్రభావవంతమైన పద్ధతులలో విశ్వరూపం చూపించింది. తెలంగాణ ఉద్యమవ్యాకరణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే అధ్యయనం ఇంకా జరగవలసే ఉన్నది.
రాష్ట్రసాధన తరువాత కూడా సకలజనశక్తులు రాజకీయపార్టీలకు అతీతంగా తన మనుగడను సాగించి, ఉద్యమాశయాలను నెరవేర్చే క్రమంలో భాగం పంచుకోగలిగితే బాగుండుననే కోరిక తొలిరోజులలో బలంగానే వ్యక్తం అయింది. తనది ఇక ఉద్యమపార్టీ కాదని, రెగ్యలర్ రాజకీయపార్టీ మాత్రమేనని కెసిఆర్ చెప్పినా, ఆయన తన పరిపాలన కు మార్గదర్శకంగా లేదా దిద్దుబాటు వ్యవస్థగా ఒక పౌరసమాజ వ్యవస్థ ఉండాలని, దానిని తాను ఏర్పరుస్తానని ప్రకటించారు. తనను తాను దృఢపరచుకోవలసిన, తన నాయకత్వాన్ని స్థిరపరచుకోవలసిన రాజకీయ లక్ష్యాలది పై చేయి కావడంతో, సద్విమర్శకు, నిర్మాణాత్మక విమర్శకు అవకాశం కల్పించే చారిత్రక అవకాశాన్ని ఆయన కోల్పోయారు. అతి త్వరలోనే తన విధానాలను తప్పుపట్టే విమర్శకులను దూషించడం, ప్రజాసంఘాలకు, ఉద్యమాలకు నిర్బంధాన్ని అందించడం చేశారు. తెలంగాణ సాధనలో కీలకమయిన పౌరభాగస్వాములను అప్రధానం, అలక్ష్యం చేయడంలో విజయం సాధించారు. ఉద్యమసమాజంలో ఒక గణనీయమైన భాగం, టిఆర్‌ఎస్/బిఆర్‌ఎస్ విధానాలను సమీక్షిస్తూ, అవసరమైనప్పుడు తప్పుపడుతూ వచ్చింది. వారే, తొమ్మిదేళ్ల తరువాత, బిఆర్‌ఎస్ పరాజయం పొంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేశారు కూడా.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, తాను చేసిన సంక్షేమ, విధాన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చలేక, విఫలమవుతున్నప్పుడు, ఆ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కెసిఆర్ మీద, ఆయన సహచరుల మీద ఆరోపణలు, అభియోగాలు, వ్యాజ్యాలను ఆశ్రయించినప్పుడు, బిఆర్‌ఎస్ తిరిగి సమాజంలో పౌరసమాజ విమర్శకులు ఉండవలసిన అవసరాన్ని గుర్తించింది. ఇంతకాలం తనను విమర్శించిన బుద్ధిజీవులు, ప్రజాకార్యకర్తలు కాంగ్రెస్‌ను కూడా వెంటనే అంతే తీవ్రతతో ఎందుకు విమర్శించడం లేదని ఆవేదన చెందసాగింది. ఆ క్రమంలో, పౌరసమాజానికే విశ్వసనీయత లేకుండా చేసే నిందాపర్వాన్ని మొదలుపెట్టింది.
తెలంగాణ రాష్ట్రసాధనలో క్రియాశీలంగా ఉన్న సకలజన ఉద్యమసమాజాన్ని తగినంత స్థాయిలో మనం కొనసాగించుకోగలిగి ఉంటే, సమాజంలో పెద్దమనుషులంటూ ఉండేవారు, ప్రజలకు వ్యతిరేకమైన విధానాలకు బలమైన ప్రతిఘటన ఏర్పడి ఉండేది. పెద ధన్వాడ లో ప్రజలు తమంతట తామే అంతటి తీవ్రమైన నిరసనకు దిగడం వెనుక, వారి ధర్మాగ్రహం ఒక్కటే కాదు, తెలంగాణ సమాజం నుంచి అటువంటి సమస్యల మీద కలసికట్టు కార్యాచరణ చేసే సమూహం లేక తామే ఒంటరిగా ప్రతిఘటించవలసి రావడం కూడా కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలలో అసమర్థంగాను, కొన్ని విషయాలలో కర్కశంగాను వ్యవహరిస్తున్నది. ఎందుకు, దీని గురించి మాట్లాడగలిగిన విశ్వసనీయ ప్రతిపక్షం లేకపోయింది? ఇథనాల్ కర్మాగారాల మీద రైతాంగం ప్రతిఘటన ఈ నాటిదికాదు. మునుపటి ప్రభుత్వం ఇంత కంటె ఏమీ మెరుగుగా, మానవీయంగా ఏమీ ప్రవర్తించలేదు. ఆ సమస్య మీద ప్రజలకు నడిపించగలిగే, లేదా, మద్దతు ఇవ్వగలిగే నైతిక హక్కు తెలంగాణ ప్రతిపక్షానికి లేకుండా పోయింది. బిఆర్‌ఎస్ ప్రమేయం కనిపించిన చోటల్లా, అదెంత న్యాయమైన అంశమైనా, రాజకీయ ప్రేరితమనే విమర్శ ప్రత్యక్షమవుతున్నది.
బిఆర్‌ఎస్ రెండు దఫాల పాలనను వ్యతిరేకిస్తూ వచ్చి, కాంగ్రెస్ విజయాన్ని సుగమం చేసిన పౌరసమాజమేధావులు, ప్రభుత్వం మీద నిర్మొహమాటమైన విమర్శకు ఇంకా వెనుకాడుతున్నారు. ఇంకా తగిన సమయం రాలేదనో, రెండు ప్రభుత్వాల పోలికల్లో మొగ్గు ఇటే ఉన్నదనో, సాపేక్షంగా ప్రజాస్వామిక హక్కుల వాతావరణం మెరుగుగా ఉన్నదనో ఏవో కారణాలు చెబుతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా నిలబడడం కూడా తెలంగాణ పౌరసమాజం అలవరచుకున్న లక్షణం కాబట్టి కూడా, జాతీయస్థాయి ద్వంద్వంలో కాంగ్రెస్ వైపు అనుకూలత వారికి తప్పనిసరి అవుతోంది. కానీ, పెదధన్వాడ రైతుల మీద, అక్కడి ఉద్యమవార్తలను ప్రచురించిన పత్రికల మీద ప్రభుత్వ చర్యలను గమనిస్తే, పౌరహక్కుల విషయంలో కాంగ్రెస్ రేటింగ్ దారుణంగా పడిపోతోందనే చెప్పాలి.
ప్రభుత్వవిమర్శకులు ప్రతిపక్ష అనుకూలురు కానక్కరలేదు. ఆకాంక్షలో, సమస్యలో, ఆశయాలో ఆధారంగా ఒక ఉమ్మడి కార్యాచారణ ఎట్లా చేయవచ్చో తెలంగాణ సకలజనుల ఉద్యమం నిరూపించింది. కాంగ్రెస్‌కు, బిఆర్‌ఎస్‌కు, బిజెపికి అతీతంగా, ఒక పౌరసామాజిక శక్తి ప్రభావశాలిగా ఉండజాలదా? రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యుఐ వ్యతిరేకిస్తూ, కార్యాచరణలో పాలుపంచుకుంటోంది. అదే తరహా పద్ధతిని ప్రజాసంఘాలన్నీ పాటించగలిగితే, ఫక్తు రాజకీయపార్టీలు కూడా, కొన్ని ప్రజాస్వామిక ఒత్తిడులకు లోబడి పరిపాలనో, ప్రజాజీవితాచరణో చేయగలుగుతాయి.

తెలంగాణలో విలువల, ఆశయాల ఆధారిత శక్తులు ఇంకా బలంగానే ఉన్నాయి. ఆపరేషన్‌కగార్ కు వ్యతిరేకంగా, తెలంగాణ సమాజంలోని విస్తృత శక్తులు ప్రదర్శనలు చేస్తున్నాయి, గొంతు విప్పుతున్నాయి. దురదృష్టవశాత్తు, జాతీయస్థాయిలో అటువంటి పౌరసమాజం బలహీనంగ ఉండడం వల్ల కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడీ పడడంలేదు., ఆపరేషన్ క్షేత్రం బయటి రాష్ట్రంకావడం వల్ల తెలంగాణ గొంతు సరిహద్దులలోపలే అణగారిపోతున్నది. కానీ, రాష్ట్రసంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద విశాలసమాజం పనిచేయగలిగితే మంచి ఫలితాలను సాధించగలుగుతుంది. బనకచర్ల వివాదం మీద తెలంగాణ నుంచి ఎందుకు ఒక జెఎసి ఏర్పడకూడదు? లేదా, తెలంగాణలో ప్రజానుకూల అభివృద్ధి విధానాల సాధనకు ఒక విశాల ఐక్యకార్యాచరణ సమితి ఎందుకు పనిచేయగూడదు?
తెలంగాణ సమాజం మళ్లీ అలనాటి జెఎసి స్ఫూర్తితో పనిచేయాలని ఉద్యమకారులు అన్నారంటే, బహుశా, వాళ్ల మనస్సుల్లో ఉన్నది ఇదే కావచ్చు. ఒక పార్టీకి అనుకూలంగానో, మరో పార్టీకి వ్యతిరేకంగా కాదు, అన్ని పార్టీలూ ప్రజల అభీష్టాలకు లోబడి పనిచేసేట్టు ఈ ఐక్యత ఉండాలి. తెలంగాణ కోసం ఒక వేదిక. సకలజనుల వేదిక. ఒక ఊహ మాత్రమే కావచ్చు, ఆచరణలో అనేక సమస్యలున్న అసాధ్య స్వప్నం కావచ్చు, కానీ, జర్నలిస్టుల ఫోరమ్ సమావేశంలో వ్యక్తమయిన ఈ ప్రతిపాదన ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి నుంచి పుట్టింది.