యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 24: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల వివాహం ఆదర్శప్రాయంగా నిలిచింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం ఆదర్శ వివాహం చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. వీరు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





