సమ సమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు కృషి

– స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నోపల్లి కలెక్టరేట్ వెళ్లే దారిలో బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం చేసిన బసవ భవన్ ఫంక్షన్ హాల్ని స్పీకర్ ప్రసాద్ కుమార్  శుక్రవారం ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జయరాబాద్, మాజీ ఎంపీ బీబీ పాటిల్,మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని ఆయన బసవ ఫిలాసపి ఎంతో ఆదర్శనీయమని ప్రతి ఒక్కరు ఆయన చూపిన మార్గం నడుచుకొని చక్కటి జీవితాన్ని సాగించాలని తెలిపారు. ఈ ప్రాంత వీరశైవ సమాజం సభ్యులకు ఈ బసవ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ వీరసేవ సమాజం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, వీర సేవ బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *