– షేక్‌పేట నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు మోడల్ కారిడార్
– బస్సులో అధికారుల ప్రయాణం.. పరిస్థితుల అధ్యయనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి ఈ మార్గాన్ని ’îÖడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం పర్యటించారు. అధికారులందరూ ఒకే బస్సులో ప్రయాణిస్తూ మార్గస్త్రమధ్యలో ఉన్న బాటిల్ నెక్‌లు, నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఎస్‌డిఐ హాస్పిటల్ వద్ద, బృందావన్ కాలనీ రోడ్ నంబర్-1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయించారు. షేక్‌పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ డియన్‌ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎనఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, అలాగే షేక్‌పేట్ నాలా సపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మెహదీపట్నం వైపు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణమే చేయదగ్గ పనులు, దీర్ఘకాలిక పనులను గుర్తించామని సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పనుల నిమిత్తం ప్రతి జోన్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి.జోయల్ డెవిస్, జి.ముకుంద రెడ్డి, ప్రియాంక ఆలా, కాజల్, కె.శ్రీనివాస్, ఎస్.రత్నాకర్, వేణుగోపాల్ రెడ్డి, డి.ధనలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



