క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19 :  కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు.   రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే భారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారంలో భారాస వైఖరి ఏంటని ప్రశ్నించారు.  అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

\అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అట్రాసిటీ కేసు బుక్‌ చేయాలని అన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ స్టాండ్‌ ఎంటో అమిత్‌ షా బయట పెట్టారని చెప్పారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించాలన్నారు. స్వాతంత్య ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్‌ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.    అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను గాయపరిచిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *