– పాలమూరువాసి మృతి
– మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయండి
– కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మృతుని తండ్రి విజ్ఞప్తి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అమెరికాలో మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థి అజీముద్దీన్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది. వివరాలిలా ఉన్నాయి. మహ్మద్ నిజాముద్దీన్(29) అమెరికాలో మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్లి కాలిఫోర్నియాలోని శాంటక్లారాలో నివసిస్తున్నాడు, తన రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ తర్వాత శాంటా క్లారా పోలీసులు అతనిని కాల్చి చంపారు. తన కుమారుడి స్నేహితుడినుంచి ఈ సమాచారం అందిందని, అయితే ఈనెల 3వస్త్రం తేదీన ఘటన జరిగినప్పటికీ అసలేమి జరిగిందనేది అస్పష్టంగా ఉందని మృతుడి తండ్రి మహమ్మద్ హన్నుద్దీన్ తెలిపారు. గురువారం ఉదయం ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందన్నారు. తన కొడుకు మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తీసుకురావడంలో సహాయం చేయాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు. అతని మృతదేహం శాంటాక్లారాలోని ఒక ఆసుపత్రిలో ఉంది. ఈ వార్త అందిన వెంటనే బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అన్సర్ హుస్సేన్ అతని కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు అజీముద్దీన్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడంలో చొరవ చూపాలని మహబూబబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, భారత రాయబారి దృష్టికి తీసుకెళ్లి కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సెలేట్ జనరల్ నుండి వివరణాత్మక నివేదికను పొంది నిజాముద్దీన్ మృతదేహాన్ని అతని గ్రామానికి పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు సమాచారం. మృతదేహాన్ని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలని అన్సర్ హుస్సేన్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





